డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 120వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ముఖ్యమంత్రి రోశయ్య ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.
ఈ రోజే అంబేద్కర్ జన్మదినం కావడంతో అన్ని పార్టీల నేతలు ట్యాంక్‌బండ్ మీదనున్న అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి రోశయ్యతోపాటు పలువురు మంత్రులు, నాయకులు, తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, రాఘవులు, సీపీఐ నేత నారాయణ, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, తదితర సంఘాలకు చెందిన వారు అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
ఇదిలావుండగా అంబేద్కర్ జయంతిని పురస్సరించుకుని కులాంతర, మతాంతర వివాహాలు నిర్వహిస్తున్నట్లు దళిత కల్యాణవేదిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ ఎల్లయ్య మీడియాకు తెలిపారు. కాగా కులాంతర, మతాంతర వివాహాల సందర్భంగా దాదాపు వంద జంటలకు ఈరోజు వివాహాలు జరపనున్నామని ఆయన వెల్లడించారు. |