త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించారు. సోమవారం ప్రకాశం జిల్లాలో ప్రజాపథంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తొలిసారిగా మంత్రివర్గ విస్తరణపై నోరు విప్పారు.
తాను చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీలకు కూడా అవకాశం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో మంత్రుల సంఖ్య 44కి చేరే అవకాశం ఉన్నదన్నారు.
ఇదిలావుండగా ఎమ్మెల్సీలకు కేబినెట్‌లో స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించిన అనంతరం పలువురు ఎమ్మెల్సీల పేర్లు బయటకు వస్తున్నాయి. మరోవైపు అనుభవజ్ఞులైన సీనియర్లకు చోటు కల్పిస్తారన్న వాదనలు వినబడుతున్నాయి.
|