శ్రీకృష్ణ దేవరాయల పంచశతాబ్ది
ఉత్సవాలు భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా హైదరాబాదులోని రవీంద్ర
భారతిలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగుజాతికి, భాషకు రాయలవారు చేసిన సేవలకు
గుర్తుగా, ఆయన పట్టాభిషిక్తులై 500 ఏళ్లు గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాయల
పంచ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో తొలుత మంత్రి గీతారెడ్డి
మాట్లాడుతూ... తెలుగుజాతికి రాయలు చేసిన సేవను కీర్తించారు. ఇటువంటి బృహత్తర
కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి రోశయ్యగారు సంకల్పించడం ఎంతో ముదావహం
అన్నారు.
ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య
ప్రసంగించారు. శ్రీకృష్ణ దేవరాయల పంచ శతాబ్ది ఉత్సవాలకు భారత రాష్ట్రపతి సమయాభావం
ఉన్నప్పటికీ తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసినందకు ప్రత్యేకంగా
కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్
నరసింహన్, కేంద్ర పట్టణాభివృద్ధి జైపాల్ రెడ్డి, దేవాదాయ శాఖామంత్రి గాదె
వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి, తితిదే ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు
తదితర ప్రముఖులు పాల్గొన్నారు |