ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తన
మనస్సులోని మాటను వెల్లడించారు. తాను కూడా ఒకపుడు చిరంజీవి అభిమానినేనన్నారు.
అయితే, సినిమాలపై తనకు పెద్దగా అవగాహన లేదని, సినిమాలు కూడా పెద్దగా చూడబోన్నారు.
అయినప్పటికీ.. తాను కూడా హీరో చిరంజీవి అభిమానినన్నారు.
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు
పవన్‌కళ్యాణ్ నటించిన సినిమా 'కొమరం పులి' ఆడియో రిలీజ్ పంక్షన్‌కు రోశయ్య ముఖ్య
అతిథిగా హాజరయ్యారు. పాటల రచయిత చంద్రబోస్ అందించిన సాహిత్యానికి ట్యూన్స్
అందించిన సంగీత్ర సామ్రాట్, ఆస్కార్ విజేత ఏఆర్.రెహ్మాన్ సమక్షంలోనే ఈ ఆడియో
ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు.. రెహ్మాన్ తల్లి
ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
చిరంజీవి సంరక్షణలో పెరిగిన పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం బాగా ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అలాగే,
పవన్‌కు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలని, వస్తాయని చెప్పారు. తన భవిష్యత్‌లో
మరిన్నిహిట్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ మరిన్ని హిట్ చిత్రాల్లో నటించాలని రోశయ్య
కోరారు. |