కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్న నమ్మకం ప్రజలకు తెలిసిపోయిందని మాజీ స్పీకర్ కే.ఆర్. సురేష్‌రెడ్డి అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లా డారు. గత ఏడాదిగా అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలు గుర్తించారని, బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తాను మంజూరు చేసిన పనులను, సమస్యలను పదవీ లేకున్న పరిష్కారిస్తున్నానని ఆయన తెలిపారు. చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల ద్వారా త్వరలోనే ట్రయల్న్ నిర్వహించి మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల చెరువులను నింపుతామన్నారు. గుమ్మిర్యాల్-కొండాపూర్ రోడ్డు మధ్య కూలిన కల్వర్టును తాత్కాలికంగా మరమ్మతులు చేయించి, అధికారులతో చర్చించి నూతన కల్వర్టును నిర్మించి రోడ్డు బాగు చేస్తానన్నారు. అర్ధంతరంగా నిలిచిపోయిన గుమ్మిర్యాల్- కమల్ కోట్ గ్రామాల మధ్య గల గోదావరిపై నిర్మిస్తున్న వంతెన పనులు వేగవంతం జరిగేలా క్లియరెన్స్ చేయించానని, వంతెన పనులు త్వరలో పూర్తి చేస్తారని ఆయన పేర్కొన్నారు.
|