ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారదేశానికే ఆరోగ్య రాజధానిగా తయారయిందని సిఎం రోశయ్య అన్నారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అధునాతన సౌకర్యాలు గల ఆసుపత్రులున్నాయని, విదేశీయులు కూడా హైదరాబాద్‌కు చికిత్సకోసం వస్తున్నారని రోశయ్య తెలిపారు. ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి ఏర్పాటు చేసిన నారాయణ హృదయాలయ అసుపత్రిని సిఎం రోశయ్య మంగళవారం ప్రారంభించారు. అనంతరం నారాయణ మూర్తి మాట్లాడుతూ... ప్రపంచ జనాభాలో ఆరవ వంతు ఉన్న మన దేశం ఆరోగ్య సౌకర్యాల్లో అట్టడగు స్థాయిలో ఉండటం ఎంతో బాధాకరమని, మన ఆధునిక సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులు కొంత మందికే ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు. మన దేశంలోని ప్రతీ పౌరునికి ఆధునిక వైద్యం అందాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. |