దేశంలో మెరుగైన, నాణ్యవంతమైన విద్యను అందించడంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, విద్యా రంగానికి రూ.11 వేల కోట్ల బడ్జెట్‌తో కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. విద్యాశాఖ పనితీరుపై ఆయన ఆదివారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విద్యార్థి లోకానికి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. అలాగే, 2333 కోట్ల రూపాయల వ్యయంతో 33 లక్షల మందికి ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. |