రాష్ట్రానికి వరద ముప్పు ప్రమాదం ఇంకా తొలగిపోలేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహయ పునరావాస చర్యలను ఆయన ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్నారు. అందువల్ల అధికారులతో పాటు.. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే వరద బాధిత ప్రాంతాలకు ఆరు లక్షల ఆహార పొట్లాలతో పాటు.. 125 మర బోట్లను తరలించినట్టు ఆయన తెలిపారు.
అంతకుముందు.. వరద సహాయ పునారావాస చర్యలపై ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోశయ్యలు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు.. అన్ని శాఖల కార్యదర్శులు కూడా శుక్రవారం రాత్రంతా సీఎస్ కార్యాలయంలోని కంట్రోల్ రూంలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షించారు. |