రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు 320 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో సురక్షితమైన రోడ్లు, నాణ్యత తదితర అంశాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. పునర్నిర్మాణం, అభివృద్ధిలో భాగంగా అంతర్జాతీయ బ్యాంకు ఈ రుణాన్ని మంజూరు చేస్తూ 30 సంవత్సరాల మెచ్యూరిటీ కాలపరిమితిని, గ్రేస్ పీరియడ్‌ను 5.5 సంవత్సరాలుగా నిర్ణయించింది.
ఈ మొత్తం నిధులతో 429 కిలోమీటర్ల రోడ్డు మార్గా్ని అప్‌గ్రేడ్ చేయడం, ఆరు వేల కిలోమీటర్ల పొడవు గల రోడ్ల పర్యవేక్షణకు ఉపయోగిస్తారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో రోడ్డు రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మేరకు సరకుల, ప్రయాణికుల రవాణా రోడ్డుమార్గంలోనే సాగుతోందని బ్యాంకు పేర్కొంది.
ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలోనే పెట్టుబడి పెడుతోందని తెలిపింది. రాష్ట్రంలో విద్యా, ఉపాధి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో కీలకమని ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరక్టర్ రోబెర్టో జఘా తెలిపారు.
రాష్ట్రంలో రోడ్డు భద్రతా అత్యంత సమస్యగా మారింది. గత 2007 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 36 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారని వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టు టీమ్ లీడర్ బిన్యమ్ రెజా తెలిపారు. |