"
స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగీత మాంత్రికుడు, సంగీత యువకెరటం ఎ.ఆర్. రెహ్మాన్ బృందం నిర్వహించే.. "జయహో" సంగీత విభావరి శనివారం రాత్రి హైదరాబాదులో జరుగనుంది.
దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డికి.. ఈ విభావరి ద్వారా ఎ.ఆర్. రెహ్మాన్ తన స్వర నీరాజనాన్ని అర్పించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో శనివారం సాయంత్రం ఆరుగంటలు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.