దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఖాళీ ఏయిన పులివెందుల నియోజకవర్గంలో ఉపఎన్నికను డిసెంబరులో నిర్వహించాల్సిందిగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను శుక్రవారం వెలువడింది. ఈ నెల 26, 27 తేదీల్లో నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేయనుంది. డిసెంబరు మూడోవారంలో ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో.. పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానానికి ఏర్పడిన ఖాళీని ఆరునెలల్లో ఉప ఎన్నిక నిర్వహించి భర్తీ చేయాల్సి ఉంది. |