home sitemap contact www.apmlas.com menu
Search
search
Photo Gallery
Flood Rescue Work in AP
In Memory of our Ex CM Dr. Y.S Rajasekhara Reddy
MLAs Swearing-In Cermony 2009
MLAs Contact Info
Useful Links
Government Links
Media Links
Political Parties
Hits Counter
free html visitor counters
 
పులివెందుల ఉప ఎన్నిక:నామినేషన్ దాఖలు
 

పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నిక కోసం దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్.విజయలక్ష్మి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను స్థానిక రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. పులివెందుల ఎమ్మార్వో కార్యాలయంలో విజయలక్ష్మి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఆమె వెంట కడప ఎంపి, తన కుమారుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, మరిది, ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి, మంత్రి గల్లా అరుణకుమారి, పలువురు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయలక్ష్మికి మద్దతుగా భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, హితులు, సన్నిహితులు పులివెందులకు చేరుకున్నారు.

నామినేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత వైఎస్ జగన్ ప్రసంగించకుండానే కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్ళారు. ఇదిలావుండగా, విజయలక్ష్మి నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు భారీ సంఖ్యలో నియమించారు.
 

Some More News
మదర్‌ థెరెసా గౌరవార్థం అమెరికా పోస్టల్‌ ĸ
తెలంగాణ వస్తే ఉప ముఖ్యమంత్రి ముస్లీంలకు
బోదనా ఫీజులు చెల్లించడానికి సర్కారు సిద్
అసెంబ్లీలో మెరుపు ధర్నా
సర్కారును అస్థితరపరిచేందుకు కుట్ర
అర్హులైన వారికి సంక్షేమ పథకాల ఫలితాలు
హైదరాబాద్‌ మెట్రో రైల్ దేశానికే మణిహారం
గ్రూప్1 పరీక్షను రద్దు చేయాలి: కేసీఆర్
more news >>
Copyrights Reserved@apmlas.com Powered By